నిన్న సిద్దిపేటలో సీనియర్ పాత్రికేయుడు తీగుళ్ళ కృష్ణమూర్తి కుమారుడి వివాహానికి వెళ్ళకపోవడంతో, ఈరోజు వారి ఇంట్లో నిర్వహించిన సత్యనారాయణ స్వామి వ్రతానికి బిఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ – శోభ దంపతులు హాజరయ్యారు ఈ సందర్భంగా సత్యనారాయణ వ్రతం ముగిసిన తరువాత ఈ రోజు కేసీఆర్ జన్మదినం కావడంతో అక్కడే వున్న పూజారులు కేసీఆర్ – శోభ దంపతులు ఒకరికొకరు పూలదండలను, వంగురాళ్లను మార్పించారు. ఈ ఘటనను అక్కడే వున్న అభిమానులు మళ్ళీ పెండ్లి చూసి ఆనందపడ్డారు.

