యాదాద్రి భువనగిరి జిల్లా, రాజాపేట మండలంలోని పుట్టగుడెం గ్రామంలో బంజారా ప్రజలు అంగరంగ వైభవంగా సేవాలల్ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహారాజ్ సేవలను స్మరిస్తూ భక్తి శ్రద్ధలతో బోగ్ బండారో నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా లంబాడా సంప్రదాయ పాటలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, బంజారా వేషధారణలో ప్రత్యేక నృత్యాలు ప్రదర్శిస్తూ ఆనందోత్సాహంగా సంబరాలు జరిపారు. ఈ వేడుకలకు తహశీల్దార్, అధికారులు, ప్రజా ప్రతినిధులు, పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు.

