లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి
గచ్చిబౌలి ఏడీఈ సతీష్ రెడ్డి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు చేసేందుకు 75,000 రూపాయలు లంచంగా డిమాండ్ చేసిన ఆయన, ముందుగా 25,000 రూపాయలు స్వీకరించగా, మిగతా 50,000 రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ దాడి చేసి పట్టుకుంది. ఈ ఘటనతో ఏడీఈ కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

