రంగారెడ్డి జిల్లా కోర్టులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నిందితుడు జడ్జిపై చెప్పు విసిరాడు. జగదిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో రేప్ కేసులో నిందితుడిగా ఉన్న అతడు, గతంలో పోలీసులపై హత్యాయత్నం కూడా చేశాడు. కోర్టులో విచారణ సందర్భంగా అతను ఆకస్మికంగా జడ్జిపై చెప్పు విసరడంతో న్యాయవాదులు అతడిని చితకబాదారు. ఘటనపై పోలీసుల స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో చోటుచేసుకున్న ఈ ఘటన అక్కడ అలజడి సృష్టించింది.

