సైబరాబాద్ డిఐ నార్సింగ్ శ్రీనివాస్ ను ఐజి ఆఫీసుకు అటాచ్ చేశారు. లావణ్య తో తరచూ వీడియో కాల్స్, ఆడియో కాల్స్ ద్వారా సంభాషణలు జరిపినట్లు ఆరోపణలు రావడంతో ఈ చర్యలు తీసుకున్నారు. లావణ్య, శ్రీనివాస్‌ల ఆడియో కాల్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు విచారణ జరిపారు. విచారణలో లావణ్యతో ఆయన మాట్లాడిన సంగతిని ధృవీకరించడంతో తక్షణమే చర్యలు తీసుకుని ఐజి ఆఫీసుకు బదిలీ చేశారు. లావణ్య, రాజ్ తరుణ్ పై పిర్యాదు చేసినప్పటి నుంచి శ్రీనివాస్‌తో పరిచయం పెరిగిందని సమాచారం. ఈ వ్యవహారం వైరల్ కావడంతో పోలీసులు చర్యలు చేపట్టారు.

