పాలకుర్తి టూరిజం కారిడార్ ను కలియ తిరిగిన విద్యార్థులు
డైమండ్ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులు ప్రముఖ చారిత్రక, ఆధ్యాత్మిక, సాహిత్య, సంస్కృతిక, పర్యాటక పాలకుర్తి టూరిజం కారిడార్(బమ్మెర, పాలకుర్తి, వల్మిడి) ను సందర్శించగా, స్టూడెంట్ ఫర్ సేవ & మార్గం ఫౌండేషన్ అధ్యక్షులు మార్గం సాయి సందీప్ తేజ, మండల యాదవ సంఘం ప్రధాన కార్యదర్శి సంగి వెంకన్న యాదవ్ స్వాగతం పలికారు. ఆలయ పూజారులు దేవగిరి లక్ష్మన్న, డీవీఆర్ శర్మ, అనిల్ శర్మ, మత్తగజం నాగరాజు శర్మ లు ఇక్కడి ప్రాంత చరిత్రను వివరించారు. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ కనకరాజు మాట్లాడుతూ…. తమకు ఈ విహార విజ్ఞాన యాత్ర జీవితాంతం గుర్తు ఉండి పోతుందని, సాహిత్యం పై చెరగని ముద్ర వేసిన కవులు సోమన, పోతన, వాల్మీకి ల గ్రామాల సందర్శన తమ మదిపై చెరగని వేసిందని అన్నారు. ఈ విహార యాత్రలో ఇతర స్కూల్ డైరెక్టర్లు , ఆలయ అధికారులు వెంకటయ్య, శ్రీనివాస్, రాములు, సోమన్న, మధు తదితరులు పాల్గొన్నారు.


