బిఆర్ఎస్ నుంచి ఇతర పార్టీలకు ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తోంది. ఈ కేసులో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావు సహా మరికొందరు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు ఉన్నాయి. పది నెలల సమయం “రీజనబుల్ టైమ్” కాదంటూ పిటిషనర్ల వాదనలు వినిపించగా, సుప్రీంకోర్టు ఈ అంశంపై విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. ఎమ్మెల్యేల అనర్హత నిర్ణయంపై తగిన చర్యలు తీసుకోవాలని పిటిషనర్లు కోర్టును కోరుతున్నారు.

