బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, తమ పిటిషన్‌లో పార్టీల మారిన 10 మంది ఎమ్మెల్యేలను అనర్హత విధించాలని కోరారు. ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. కారు గుర్తుపై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. వారిపై అనర్హత వేటు వేసేందుకు స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన మూడు వేర్వేరు పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది. ఈ సందర్భంగా, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరెకపూడి గాంధీ వంటి ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశించాలని బీఆర్‌ఎస్ నేతలు రిట్ పిటిషన్ వేశారు. అలాగే, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరి వంటి ఎమ్మెల్యేలపై చర్యలకు ఆదేశాలివ్వాలని పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్‌ల తరపున ప్రత్యేక పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ మూడు పిటిషన్లను కలిపి జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కే. వినోద్ చంద్రన్ ధర్మాసనం విచారించనుంది. ఈ నెల 4న, 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించిన విషయంపై అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు.

