హైదరాబాద్ శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా అధికారులు అక్రమ హోర్డింగ్లను తొలగించారు. బెంగళూరు జాతీయ రహదారిపై అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన హోర్డింగ్లను మున్సిపల్ అధికారుల సహాయంతో హైడ్రా తొలగించింది. అధికారుల విచారణలో శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 17 అక్రమ హోర్డింగ్లు ఉన్నట్లు గుర్తించారు. మున్సిపల్ అధికారుల ఫిర్యాదుతో హైడ్రా తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంది. అంతేకాదు, నిర్మాణ వ్యర్థాలు, ఇతర చెత్తను అక్రమంగా డంప్ చేసే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని హైడ్రా నిర్ణయించింది. చెరువులు, నాలాలు, ఖాళీ స్థలాల్లో వ్యర్థాలు పోసే వాహనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, ఇప్పటికే నలుగురు టిప్పర్లను సీజ్ చేసింది.

