బీసీలకు అన్యాయం చేసే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కులగణన సర్వేను వందశాతం నిష్పాక్షికంగా నిర్వహించామని తెలిపారు. “హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో సర్వే పూర్తయ్యింది. నగరంలో కొందరు కావాలనే సర్వేలో పాల్గొనలేదు. మరికొందరు సర్వే అధికారులపై కుక్కలను వదిలారు” అని మంత్రి ఆరోపించారు. ప్రభుత్వం చేసే ప్రతి పని చిత్తశుద్ధితోనే జరుగుతుందని స్పష్టం చేస్తూ, బీసీల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.

