నల్గొండ బీజేపీలో మరోసారి అంతర్గత విభేదాలు గుప్పుమన్నాయి. ఇటీవల పార్టీ అధిష్టానం రాష్ట్రంలోని జిల్లాలకు కొత్త అధ్యక్షులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నాగం వర్షిత్ రెడ్డిని మరోసారి నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా నియమించారు. అయితే, ఈ నిర్ణయం పట్ల జిల్లా సీనియర్ నాయకుల్లో తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమవుతోంది.
సీనియర్ నేతలు వర్షిత్ రెడ్డి తిరిగి ఎన్నికయ్యేందుకు అతడు పార్టీ వ్యవహారాలను తనకు అనుకూలంగా మేనేజ్ చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు. ఆయన నాయకత్వాన్ని తాము అంగీకరించబోమని, వెంటనే మార్పు జరగకపోతే పార్టీ కార్యాలయంకు రాలేమని హెచ్చరించారు. వర్షిత్ రెడ్డి సీనియర్ నేతల అభిప్రాయాలను పట్టించుకోవడం లేదని, ఒంటెద్దు పోకడలకు పోతున్నాడని విమర్శలు గుప్పిస్తున్నారు.

