బిఆర్ఎస్ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, టీ. ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ఎం. సంజయ్ కుమార్‌లకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. అదనంగా, దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావుల అనర్హత పిటిషన్లను కూడా ఈ కేసుతో కలిపి విచారించనున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ ఏడుగురు ఎమ్మెల్యేల అనర్హతపై వేసిన పిటిషన్లను ప్రతివాదులైన తెలంగాణ స్పీకర్ తరఫున న్యాయవాది ముకుల్ రోహిత్గికి అందజేయాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 10కు వాయిదా పడింది. ఈ కేసు తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపుగా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

