రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నడుపుతున్న వివిధ గురుకుల లో ప్రవేశం కోసం దరఖాస్తులు స్వీకరించేందుకు గాను ఈనెల అనగా ఫిబ్రవరి 6 వరకు పెంచినట్టు TGSWREIS కార్యదర్శి Dr. వి.ఏస్ అలుగు వర్షిణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గురుకులాల్లో ఐదవ తరగతి నుండి 9 వ తరగతి వరకు..రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ,బీసీ, జనరల్ గురుకులాలలో ప్రవేశం కోసం 1 ఫిబ్రవరి 2025 చివరి తేదీగా వుండగా ఇప్పుడు మరో ఐదు రోజులపాటు గడువును పెంచారు. వరుస సెలవులు రావడం అలాగే దరఖాస్తులు అధిక సంఖ్యలో రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

