తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో అత్యవసర భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశం హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరగనుంది. తాజా రాజకీయ పరిణామాలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాలపై సీఎం చర్చించనున్నారు. ఈ భేటీకి అధికారులు రావొద్దని సీఎం ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో పార్టీ, ప్రభుత్వ అంతర్గత వ్యవహారాలు ప్రధాన అజెండాగా ఉండనున్నాయి.

