ఫోన్ ట్యాపింగ్ కేసు లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. కేసులో కీలక నిందితులుగా ఉన్న అడిషనల్ ఎస్పీ భుజంగ రావు మాజీ డీసీపీ రాధాకిషన్ రావు హైకోర్టు ధర్మాసనం ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేసింది. అదేవిధంగా రూ. లక్ష చొప్పన రెండు పూచికత్తులు, పాస్పోర్టు లను కూడా హ్యాండోవర్ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ అధికారులు ఎప్పుడు పిలిచినా దర్యాప్తునకు సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయొద్దని, సాక్షాధాలను కూడా చెరిపి వేసేందుక ప్రయత్నం చేయకూడదని అడిషనల్ ఎస్పీ భుజంగ రావు మాజీ డీసీపీ రాధాకిషన్ రావు లకు స్పష్టం చేసింది. అదేవిధంగా ఇదే కేసులో అడిషనల్ ఎస్పీ తిరుపతన్న కు సుప్రీం కోర్టు షరుతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

