పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గ అభివృద్ధి, ఐటీ రంగంలో అవకాశాల పెంపు, యువతకు ఉపాధి అవకాశాల సృష్టి వంటి అంశాలపై చర్చించారు. నియోజకవర్గంలో కొత్త పరిశ్రమలను స్థాపించడానికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రితో మాట్లాడారు. యువతకు ప్రతిష్టాత్మకమైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రిని అభ్యర్థించారు.

