రేపు నారాయణపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. కోస్గి మండలంలోని చంద్రవంచ గ్రామంలో పర్యటిస్తూ పలు సంక్షేమ పథకాలను ప్రారంభించనున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డు వంటి పథకాలకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. గ్రామస్తులతో కలసి ప్రజాసమస్యలను పరిశీలించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పర్యటన సందర్భంగా ప్రజలతో సీఎం నేరుగా మాట్లాడతారని అధికారులు వెల్లడించారు.

