ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ విద్యార్థినులకు ప్రేరణనిచ్చే మాటలు చెప్పి ప్రశంసలు పొందుతున్నారు. ఖమ్మంలోని డా.బి.ఆర్.అంబేడ్కర్ సెంటెనరీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ జూనియర్ కాలేజీకి వెళ్లిన ఆయన, విద్యార్థులతో నేలపై కూర్చొని మాట్లాడారు. జీవితంలో పెద్ద లక్ష్యాలు పెట్టుకుని, ఇతరుల నెగటివ్ మాటలను పట్టించుకోకుండా, సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థులకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా ఆయన మాటలు మార్గదర్శకంగా నిలిచాయి. కలెక్టర్ మోటివేషన్ స్పీచ్ విద్యార్థినుల్లో స్ఫూర్తిని నింపిందని, భవిష్యత్తు లక్ష్యాలపై దృష్టి పెడతామని వారు తెలిపారు.

