ఆర్మూరు నియోజకవర్గం, నందిపేట మండలం కుద్వాన్పూర్ గ్రామంలో జరిగిన గ్రామ సభలో బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని స్థానిక ప్రజలు తీవ్రంగా నిలదీశారు. ఎన్నికల ముందు గ్రామంలో ఇళ్లను నిర్మిస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే, తన హామీని ఇప్పటివరకు అమలు చేయకపోవడంతో ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. సభలో పాల్గొన్న గ్రామస్థులు “ఏం మొహం పెట్టుకొని వచ్చావ్?” అంటూ ఎమ్మెల్యేను ప్రశ్నించారు. హామీలను అమలు చేయాలని డిమాండ్ చేసిన ప్రజలు, గ్రామ అభివృద్ధికి సంబంధించి పలు సమస్యలను ఆయన ఎదుట ప్రస్తావించారు. ప్రజల ఆగ్రహంతో ఎమ్మెల్యే నిరుత్సాహానికి గురై, సభను మధ్యలోనే వదిలివెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. గ్రామంలోని అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

