హైదరాబాద్‌లో ఐటీ శాఖ కీలకమైన సోదాలు ప్రారంభించింది. ఈ సారి ఐటీ అధికారులు తెలుగు చలనచిత్ర నిర్మాత దిల్ రాజు ఇంట్లో తనిఖీలు జరుపుతున్నారు. ఆయన ఇంటితో పాటు నగరంలోని ఇతర చోట్ల కూడా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం. మొత్తం 55 బృందాలుగా విభజించిన ఐటీ అధికారులు నగరవ్యాప్తంగా తనిఖీలను కొనసాగిస్తున్నారు. ఈ సోదాలు సినీ పరిశ్రమలో సంచలనం రేపాయి. ఈ చర్యలపై ఇంకా అధికారిక వివరాలు వెల్లడి కాలేదు.

