దేవురుప్పల మండలం చిన్నమడూరు గ్రామంలో నిర్వహించిన శ్రీ సోమేశ్వర చందు యక్షగాన రెండవ వార్షికోత్సవాలకు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ….యక్షగానాన్ని భారతీయ సాంప్రదాయ కళలలో ఒక అద్భుతమైన కళారూపంగా అభివర్ణించారు. యక్షగాన కళాకారులు తమ ప్రతిభతో సాంప్రదాయ కళను కొనసాగించడం ఎంతో ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఈ కళాకారులను ప్రోత్సహించడం ద్వారా భవిష్యత్ తరాలకు ఈ కళను అందించగలమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ విధమైన సాంస్కృతిక కార్యక్రమాలకు మరియు కళారూపాలకు మద్దతు ఇవ్వడానికి నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత గడ్డం సమ్మయ్య గారు, ప్రముఖులు, మండల నాయకులు, కళాకారులు, తదితరులు పాల్గొన్నారు.

