నిర్మల్ పట్టణంలోని సోఫీ నగర్ కాలనీలో యువతిపై దాడి ఘటన కలకలం రేపుతోంది. దివ్య అనే యువతి తనకు ఇచ్చిన అప్పు తీర్చాలని సంతోష్ అనే వ్యక్తిని అడగ్గా, ఆగ్రహంతో సర్జికల్ బ్లేడ్ తో దాడి చేశాడు. దాడిలో దివ్య మెడపై తీవ్ర గాయాలవడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే బాధితురాలిని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

