షాక్ అయిన గ్రామ కార్యదర్శులు
నల్గొండ జిల్లా కలెక్టర్ త్రిపాఠి సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిబంధనలను ఉల్లంఘించి, అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు అయిన 99 మంది పంచాయతీ కార్యదర్శుల సర్వీస్‌ను బ్రేక్ చేశారు. ఈ కార్యదర్శులు పోటీ పరీక్షల పేరుతో నెలల తరబడి విధులను విస్మరించడంతో కలెక్టర్ ఈ చర్య తీసుకున్నారు. కలెక్టర్ నిర్ణయాన్ని పంచాయతీ కార్యదర్శులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ, ఇది నిబంధనల ప్రకారమేనని త్రిపాఠి స్పష్టం చేశారు. సస్పెన్షన్‌కు బదులుగా మానవత్వంతో సర్వీస్ బ్రేక్ మాత్రమే చేసినట్లు తెలిపారు. అలాగే, వారికి మరో అవకాశం ఇచ్చి తిరిగి విధుల్లోకి తీసుకున్నామంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ నిర్ణయం పంచాయతీ కార్యదర్శులలో కలకలం రేపుతుండగా, విధుల పట్ల వారికి బాధ్యత పెంపొందించేందుకు ఇది ఉపయుక్తమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

