ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొనడానికి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి బయల్దేరారు. రేపు జరగనున్న ఈ కార్యక్రమానికి హాజరవుతూ, కేంద్ర మంత్రులతో భేటీ కావాలని కూడా ఆయన నిర్ణయించుకున్నారు. రేపు, ఎల్లుండి రెండు రోజులు ఢిల్లీలోనే ఉండనున్న ఆయన, ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల నిర్వహణపై చర్చలు జరపనున్నారు. ఈ సందర్బంగా, రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, కేంద్ర మంత్రుల నుంచి రాష్ట్రానికి రావలసిన నిధులపై మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. రేవంత్ ట్రిప్ పార్టీకి, రాష్ట్ర ప్రయోజనాలకు కీలకంగా మారనున్నట్లు అంచనా.

