తెలంగాణ మంత్రులకు క్లాస్
ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సీరియస్
నిన్న తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్ కమిటీ సమావేశానికి AICC దూతగా వచ్చిన ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలంగాణ మంత్రులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. మీరు మారరా…. అంటూ క్లాస్ పీకారని సమాచారం. ఈ సందర్భంలో కొంతమంది మంత్రులు పార్టీ లైన్‌ను దాటి ప్రవర్తిస్తున్నారని, ముఖ్యంగా సీఎం పై కంట్రోల్ లేకుండా ఆయనను ప్రతిపక్షాలు విమర్శిస్తుంటే, మంత్రులు సరైన సమాధానాలు ఇవ్వలేకపోతున్నారు. ప్రతిపక్షాలకు కనీసం ఎదురుదాడి కూడా చేయలేకపోతున్నారని, మంత్రుల పనితీరు సంతృప్తికరంగా లేదని స్పష్టం చేశారు.
మరోవైపు, స్థానిక సంస్థల ఎన్నికల సమాయత్తం చేసే విషయంలో కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. కష్టపడి పనిచేసిన కార్యకర్తలు, పార్టీకి సేవలందించిన వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని వారిని ఆదేశించారు. కానీ, ప్రస్తుతం మంత్రుల పనితీరు, బాధ్యతలకు తగ్గట్లు లేరని ఆయన మండిపడ్డారు.

