Friday, April 3, 2026
33.2 C
Hyderabad

రేవంత్ లైవ్ డిబేట్‌కు రా.. – మాజీ మంత్రి కేటిఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇటీవల రేవంత్ రెడ్డిని తాము జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో లైవ్ డిబేట్‌కు ఆహ్వానిస్తూ, “రేవంత్ మగాడైతే తను లైవ్ డిబేట్‌కు సిద్ధంగా రావాలి” అని సవాల్ విసిరారు. ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో అవినీతి జరిగిందని తేల్చి, ఒక్క పైసా కూడా అవినీతి జరగలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. తమపై ఉన్న ఆరోపణలను ఖండిస్తూ, ఆయన ఈ విషయంలో న్యాయవాదుల సమక్షంలో విచారణకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.

“ఇది ఆరంభం మాత్రమే… అసలు సినిమా మిగిలి ఉంది,” అని చెప్పారు కేటీఆర్. అదే సమయంలో, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పై కూడా విమర్శలు గుప్పించారు. “కొత్తగా మంత్రి అయిన పొంగులేటి ఎగిరెగిరి పడుతున్నాడు, ఆయన ఎవరెవరి భూములు గుంజుకుంటున్నాడో అన్నీ బయటకి వస్తాయి,” అని హెచ్చరించారు.

కేటీఆర్, “రేవంత్ బ్రోకర్ ముఖ్యమంత్రి, ఆయన పుట్టుకతో వచ్చిన బుద్ది పోవట్లేదు” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏసీబీ, 16న ఈడీ విచారణకు సహకరిస్తానని తెలిపారు. “రావద్దామంటే… ప్రజల ప్రాధాన్యత రైతులే,” అని ఆయన పేర్కొన్నారు. అటు, రైతుభరోసా డైవర్షన్ కోసం అక్రమ కేసులు పెట్టడం జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. “ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా, రేవంత్‌ను వదలిపెట్టే పనిలేదు,” అని కూడా స్పష్టం చేశారు.

కేటీఆర్ బీజేపీ, కాంగ్రెస్ మధ్యం సంబంధాలను కూడా విమర్శించారు. “బీజేపీ, కాంగ్రెస్ వేర్వేరు కాదని… కాంగ్రెస్‌కు రక్షణ కవచంగా బీజేపీ పనిచేస్తోంది,” అని ఆయన చెప్పారు. తనపై దాఖలైన కేసుల విషయంలో బీజేపీ వారికి అగ్రగామిగా ప్రవర్తించడంపై ఆయన ప్రశ్నలు తీసుకువచ్చారు. “ఎలక్ట్రోరల్ బాండ్స్‌ను కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైసీపీలకు అందించినా, ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు దీనిపై పెద్దగా స్పందించడంలేద,” అని ఆయన చెప్పారు.

కేటీఆర్, “మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్విడ్ ప్రో కో అర్థం కూడా తెలివిగా మాట్లాడటం లేదని,” విమర్శించారు. అదే సమయంలో, కొండగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో కేటీఆర్ ఆరోపణలు చేశారు. “రాఘవా ఇంజనీరింగ్, మెగా ఇంజనీరింగ్ ఈ ప్రాజెక్టును పంచుకున్నాయి,” అని ఆయన అన్నారు.

“రాజ్యాంగం కల్పించిన హక్కును ఉపయోగించడం తప్పేమి?” అని ప్రశ్నించారు కేటీఆర్. “రేవంత్ సునకానందాన్ని పొందడం, ప్రజల ప్రయోజనాలను భంగం చేయడం, అవినీతికి అండగా నిలబడటం వీళ్ళెవరూ కావడని,” అన్నారు. “కానీ రాజకీయ కక్షలు, అధికారం అడ్డుపెట్టుకుని విచారణకు దూరంగా ఉండటం సరైనది కాదు,” అని స్పష్టం చేశారు.

“రాజ్యాంగాన్ని గౌరవించి ఏసీబీ విచారణకు వెళ్ళితే, ఎందుకు విచారణ జరగలేదనేది అసలు ప్రశ్న,” అని కూడా జవాబిచ్చారు కేటీఆర్. “హైకోర్టు క్వాష్‌ను మాత్రమే కొట్టేసింది, తప్పు చేసినట్లుగా ఎవరూ చెప్పలేరు,” అని ఆయన అన్నారు.

సర్వసాధారణంగా, “కాంగ్రెస్ నేతలు సన్నాసులు, దొంగలు” అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. “ఈ కేసులను న్యాయస్థానాల్లోనే ఎదుర్కొంటాను” అని కేటీఆర్ తెలిపారు. “ఫార్ములా ఈ రేసుపై అసెంబ్లీలో చర్చ చేయాలని కోరినప్పుడు, సీఎం రేవంత్ పారిపోయారు,” అని అన్నారు.

“ముగింపు వరకూ, న్యాయమే గెలుస్తుందని నాకు విశ్వాసం ఉంది,” అని కేటీఆర్ తెలిపారు.

Latest News

అదిరింది గీ ఐడియా!?|ADUGU TRENDS

గా శ్రీశ్రీ ఏమన్నడు? అగ్గి పుల్ల, సబ్బు బిల్ల కాదేదీ కయితలకనర్హం అన్నడు. అవు మల్ల నిజమే కదా? కావాల్నంటే గీ వాడి పడేసే డబ్బాను దర్జాగా వాడుతున్న గీ అన్నను సూత్తే...

రాజధాని-రాజకీయాలు!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఆమోదం లభించింది. అయితే గత పుష్కరకాలంగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో రాజధాని అంశం అత్యంత వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాజధాని నిర్మాణం...

03-04-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.10 వరకు ఉపరి విదియ నక్షత్రం చిత్త సాయంత్రం 06.03 వరకు ఉపరి స్వాతి యోగం వ్యాఘాత మధ్యాహ్నం 01.05 వరకు ఉపరి హర్షణ కరణం కౌలవ ఉదయం 07.10...

పాత పోన్లల్ల బంగారం!?|ADUGU TRENDS

అవునుల్లా...నిజమే! గా పాత పోన్లు బంగారమే. గా పోన్లల్ల కెల్లి ఎల్లే, గా బంగారమసొంటి పొరతోటి, బంగారం లెక్క బ్రాస్ లెట్లు, కడాలు తయారు చేసుకుంటాండ్లు. కావాలంటే మీరే సూడుండ్లి. ఇగో గీ యన్న.....

సంక్లిష్టంగా పశ్చిమాసియా సంక్షోభం|EDITORIAL

పశ్చిమాసియాలో సమసినట్లే కనిపించిన యుద్ధం మళ్లీ ఎగసిపడుతోంది. కొంగ జపాలు, దొంగ తపాలు తప్ప యుద్ధం ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. యుద్ధ విరమణ, శాంతి ప్రవచనాలు, రాజీ మార్గాలు రానురాను మూసుకుపోతున్నాయి....

02-04-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం హనుమత్ విజయోత్సవము తిధి పౌర్ణమి ఉదయం 06.30 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం హస్త సాయంత్రం 04.35 వరకు ఉపరి చిత్త యోగం ధ్రువ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి వ్యాఘాత కరణం బవ ఉదయం...

వాడి పడేసిన పీపానే పొయ్యి!?|ADUGU TRENDS

ఏడ సూడు, గాస్ ముచ్చట్లే! గీ కాలంల గాస్ లేకుంటే వంట కాదాయే. గా యుద్ధం సేయబట్టి గాస్ దొరుకుడు బందైతాండె. ముందుకుపోత నుయ్యి, ఎనకకుపోతే గొయ్యి లాగే, మల్లా గా కట్టెల...

సీట్ల పెంపే కాదు, సంస్కరణలు కావాలి!|EDITORIAL

భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అతిపెద్దది. కానీ, ఎన్నికల వ్యవస్థలోని లోపాలు మన రాజ్యాంగ ప్రామాణికతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పార్లమెంట్, అసెంబ్లీ సీట్ల పెంపు వంటి చర్యలు సమస్యలకు అసలైన పరిష్కారాలు కావు. నిజమైన...

01-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి చతుర్దశి ఉదయం 06.21 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం ఉత్తర పగలు 03.35 వరకు ఉపరి హస్త యోగం వృద్ధి పగలు 02.21 వరకు ఉపరి ధ్రువ కరణం వణజి ఉదయం 06.21...

నిర్బంధ నిశీధిలో ‘మిణుగురు’ రేణుక!|RED SALUTE|GUMMADAVELLI RENUKA

-విప్లవ స్ఫూర్తి... చైతన్య దీప్తి -మిడ్కో మొదటి వర్ధంతి నేడు హైదరాబాద్, మార్చి 30 (అడుగు న్యూస్): విప్లవోద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి, సాహిత్యంతో సమాజాన్ని ఆలోచింపజేసిన గుమ్మడవెల్లి రేణుక అలియాస్ మిడ్కో బలిదానానికి అప్పుడే...

కలుపు సులువుగ తీసే ఇకమతు!|ADUGU TRENDS

పంట సేన్ల కలుపు సహజం. కనీ గదాన్ని తీసుడే మస్తు తిప్పలు. కూలోల్ల ని పెట్టాలె. మొక్క మొక్క పీకాలే. రోజుల తరబడి సేయాలే. మస్తు పైసలు ఖర్చు సేయాలే. ఇగ గదంతా...

జలం – జనం – జీవనం!|EDITORIAL

భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం. ప్రపంచ జనాభాలో 18% మంది భారతదేశంలో నివసిస్తున్నప్పటికీ, ప్రపంచ మంచి నీటి వనరుల్లో మన వాటా కేవలం 4% మాత్రమే ఉండటం ఆందోళనకరం. ఈ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News