నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం వద్ద బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ నేత రమేశ్ బిధూరీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయంపై కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేశారు. ఈ దాడి తాళలేక బీజేపీ కార్యకర్తలు కౌంటర్ దాడికి దిగడంతో ఇరు వర్గాలు కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలు కాగా, పోలీసులు వారిని అదుపు చేయడానికి ప్రయత్నించారు. బిధూరీ వ్యాఖ్యలు కాంగ్రెస్ నాయకులను తీవ్ర ఆగ్రహానికి గురి చేయగా, దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

