ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్షలు, ప్రారంభోత్సవాలతో బిజీ బిజీగా గడపనున్నారు. ఉదయం 11 గంటలకు మున్సిపల్, అర్బన్ డెవలప్‌మెంట్ పై సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరాంఘర్-జూపార్క్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రారంభించనున్న ఈ ఫ్లైఓవర్ ప్రజలకు రవాణా సౌకర్యాన్ని పెంపొందించేందుకు ఉపయోగపడుతుంది.

