-ప్రముఖ హృద్రోగ శాస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ హనుమాండ్ల రాజేందర్ రెడ్డి
ఘనంగా డాక్టర్ సాబ్ పుట్టినరోజు వేడుకలు
పాలకుర్తి నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు
పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి మామ, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి భర్త, అమెరికాలో ప్రముఖ హృద్రోగ శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ హనుమాండ్ల రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు అత్యంత నిరాడంబరంగా, ఘనంగా జరిగాయి. సేవ కు మారు పేరు అయిన ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని శనివారం పాలకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలు శాసన సభ్యురాలు యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి ల ఆధ్వర్యంలో జరిగాయి.


శనివారం ఉదయమే పాలకుర్తి లోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో పూజలు చేశారు. స్వామివారికి అభిషేకం చేసి తీర్థ, ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం పూజారులు వారికి స్వామివారి శేష వస్త్రాలు అందచేశారు. ఆ తర్వాత పాలకుర్తి క్యాంపు కార్యాలయంలో వారి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు సమక్షంలో కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు అందచేశారు. అనంతరం తొర్రూరు మండలం చెర్ల పాలెం లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పుస్తకాలు, నగదు, బట్టలు పంపిణీ చేశారు. స్నేహ నివాస్ అనాథ ఆశ్రమంలో అనాథలకు పండ్లు పంపిణీ, అన్నదానం, బట్టలు పంపిణీ చేశారు. డాక్టర్ రాజేందర్ రెడ్డి, తన తండ్రి పాపిరెడ్డి స్మారకార్థం నిర్మించిన 50 పడకల ప్రభుత్వ దవాఖాన లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అలాగే తొర్రూర్ మండలం సోమారం కుంట తండాలో అన్నదానం నిర్వహించారు. తొర్రూరు బస్టాండు ఆవరణలో సొంత ఖర్చులతో ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించనున్న టాయిలెట్స్ శంకు చేశారు. తొర్రూరు ఆర్ అండ్ బి అతిథి గృహంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే పాలకుర్తిలోని ప్రాథమికోన్నత పాఠశాలలో సొంత ఖర్చులతో నిర్మించనున్న టాయిలెట్స్ కి శంకుస్థాపన చేశారు. దేవరుప్పుల మండలం చిన్నమడూరు గ్రామ ప్రభుత్వ పాఠశాలలో సొంత ఖర్చులతో నిర్మించనున్న టాయిలెట్స్ కి శంకుస్థాపన చేశారు. కాగా ఆయా కార్యక్రమాలలో స్థానిక నేతలు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఆయా సందర్భాలలో ఎమ్మెల్యే మామిడాల యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి, డాక్టర్ రాజేందర్ రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి లు మాట్లాడుతూ, ఎంత సంపాదించినా సేవా కార్యక్రమాల వల్ల కలిగే సంతృప్తి మరెందులోనూ కలగదని అందుకే తమ కుటుంబం మొత్తం పాలకుర్తి నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలకు అంకితమైందని అన్నారు. పాలకుర్తి నియోజకవర్గం ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయు ఆరోగ్యాలతో వర్ధిల్లాలి అన్నదే తమ సంకల్పమని వారు తెలిపారు.

ఈ కార్యక్రమాలలో వారి కూతురు సప్న రెడ్డి, అల్లుడు అమిత్, తొర్రూరు మార్కెట్ చైర్మెన్ హనుమాండ్ల తిరుపతి రెడ్డి, బంధు మిత్రులు, నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.


