సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో ‘రైతు భరోసా’ విధివిధానాలను ఖరారు చేయాలని, పంట పెట్టుబడి సాయం అందించడానికి ప్రతిపాదనలు ఆమోదించే అవకాశముంది. అలాగే, రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు అందించనున్నారు. కొత్త రేషన్ కార్డుల జారీ, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక, సిమెంట్, స్టీలు సరఫరాపై చర్చించనున్నారు. బీసీ రిజర్వేషన్లకు డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటుకు గణాంకాలు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వనున్నారు. యాదగిరిగుట్ట ఆలయ పాలక మండలి ఏర్పాటుపై కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.

