రైతుల కోసం ప్రవేశపెట్టిన రైతు భరోసా పథకానికి షరతులు విధించడం తగదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా మండిపడ్డారు. దేశానికి అన్నం పెడుతున్న రైతులు ప్రభుత్వ పథకాలను అడుక్కోవాల్సిన స్థితికి చేరుకోవడం దారుణమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. బోధన్‌లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలతో వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెడుతోందని, బేషరతుగా రైతులందరికీ రైతు భరోసా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని కవిత అన్నారు.

