కాంగ్రెస్ నేత శేఖర్‌పై రోటిబండ తండా వాసులు దాడి చేసిన ఘటనపై బొంరాస్‌పేట పోలీసులు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కి నోటీసులు జారీ చేశారు. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరుకావాలని సూచించారు. జనవరి 2న బొంరాస్‌పేట పోలీస్ స్టేషన్‌కు హాజరు కావాలని పోలీసులు కోరారు. రోటిబండ తండా ఘటనపై తగు విచారణ చేపట్టేందుకు పట్నం నరేందర్ రెడ్డి సహకరించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

