మంచు విష్ణు సిబ్బంది పై మరో వివాదం చుట్టుముట్టింది. జల్‌పల్లి సమీపంలోని చిట్ట అడవిలో వీరి వేట కొనసాగడం తీవ్ర విమర్శలకు దారితీసింది. మేనేజర్ కిరణ్ మరియు ఎలక్ట్రిషన్ దేవేంద్ర ప్రసాద్ అడవి పందులను వేటాడి బంధించి తీసుకెళ్లిన ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
వేట జరిగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడవిలోకి ప్రవేశించి పందులను వేటాడటాన్ని పర్యావరణ పరిరక్షణకు హానికరం. మంచు మనోజ్ ఈ చర్యలను తప్పుబడుతూ, అడవిలో వేట కొనసాగించవద్దని ఇప్పటికే వారిని పలుమార్లు హెచ్చరించినట్లు సమాచారం.
ఈ వివాదంపై దృష్టి పడటంతో అడవి జంతువుల సంరక్షణకు సంబంధించి కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. మంచు విష్ణు సిబ్బందిపై అధికారులు చర్యలు తీసుకుంటారా అనే ప్రశ్న నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

