తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సినీ ప్రముఖులు రేపు సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నారు. ఈ సమావేశం కోసం షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఈ సమావేశం కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరగనుంది.
తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో ముఖ్యంగా చిరంజీవి, వెంకటేష్, అల్లు అరవింద్, ప్రముఖ నిర్మాతలు, దర్శకులు పాల్గొననున్నారు.
ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్, దామోదర రాజనర్సింహ హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

