తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతున్న అక్రమ కేసుల డ్రామాపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గారు ఘాటుగా స్పందించారు. ఆమె ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ, “రాజకీయంగా ఎదుర్కోలేక బీఆర్‌ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ గారిపై అక్రమ ఆరోపణలు వేయడం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు,” అన్నారు.
“అసెంబ్లీలో చర్చకు ధైర్యం చేయలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేటీఆర్‌పై అక్రమ కేసులతో భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేయడం రాజకీయ అమాయకత్వమే. తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టిన బీఆర్‌ఎస్ కేడర్‌ను ఇలాంటి చిల్లర వ్యూహాలు ఏమాత్రం భయపెట్టవు. ఇవి మాకు మరింత బలం చేకూరుస్తాయి,” అని కవిత పేర్కొన్నారు.
ఆమె తన పోస్ట్‌లో, “మేము కేసీఆర్ గారికి సైనికులం. పోరాటం మాకు కొత్త కాదు. అక్రమ కేసులతో మా గొంతులు నొక్కలేరు. తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చి న్యాయసిద్ధంగా ప్రజల కోసం పని చేస్తున్నాం. అని స్పష్టం చేశారు.

