Friday, April 3, 2026
35.2 C
Hyderabad

‘ఖాకీ’లపై ‘ఖద్దరు’ ఫిర్యాదు!|POLICE|POLITICIANS

రాజకీయ జోక్యం, పోలీసుల ప్రమేయంతో..
అమాయకులపై తప్పుడు అట్రాసిటీ కేసులు|CASE
ఉన్నతాధికారితో విచారణకై డీజీపీకి విజ్ఞప్తి|DGP
WARANGAL|EAST|వరంగల్ తూర్పులో మళ్ళీ చెలరేగిన అలజడి

CONGRESS|MLC|కాంగ్రెస్ ఎమ్మెల్సీ సారయ్య సంచలనం

సంచలనాలకు నెలవైన వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మరోసారి స్వపక్షంలో విపక్షం సమరానికి సై అంటోంది. అటో ఇటో తేల్చుకోవడానికి రె‘ఢీ’ అయింది. ‘ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుండి కొందరి రాజకీయ నాయకుల ఆధిపత్యం కోసం కొందరు పోలీసు అధికారులు, మరికొందరి అమాయకులపై తప్పుడు అట్రాసిటీ కేసులు పెడుతున్నార’ని, మాజీ మంత్రి, కాంగ్రెస్ కే చెందిన ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య శుక్రవారం డీజీపీకి ఫిర్యాదు చేయడం ద్వారా కయ్యానికి కాలుదువ్వారు. ‘నమోదైన తప్పుడు కేసులను ఉన్నత పోలీసు అధికారితో విచారించాలని డీజీపీకి వినతి పత్రం అందచేశారు. అయితే, ఈ నియోజకవర్గానికి రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తుండటం ఆసక్తిగా మారింది.

వరంగల్, జనవరి 2 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
కొద్దికాలంగా నిశ్శబ్దంగా ఉన్న వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మళ్ళీ వివాదాల అలికిడి వినిపిస్తోంది. నియోజకవర్గంలో చెలరేగుతున్న అట్రాసిటీ కేసుల పరంపరపై వ్యతిరేక అలజడి మొదలైంది. మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఈరోజు తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శివధర్ రెడ్డిని కలిశారు. నియోజకవర్గంలో రాజకీయ జోక్యంతో, తమ ఆధిపత్యం కోసం కొందరు సామాన్యులపై పోలీసు అధికారులు తప్పుడు అట్రాసిటీ కేసులు నమోదు చేస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. ఆయన డీజీపీకిచ్చిన లిఖిత పూర్వక ఫిర్యాదులో ఈ విధంగా ఉంది.

‘ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి వరంగల్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలోని ఏజే మిల్స్ కాలనీ, ఇంతేజార్‌గంజ్, మట్వాడా అనే మూడు పోలీస్ స్టేషన్లలో నమోదు చేయబడిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై ఒక ఉన్నత పోలీసు అధికారితో పునః విచారణ జరిపించాలని అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే, కొందరి రాజకీయ నాయకుల ప్రభావంతో పోలీసు అధికారులు ప్రముఖ వ్యక్తులపై, సంబంధిత రాజకీయ నాయకుల బృందంలో చేరడానికి నిరాకరించిన రాజకీయ నాయకులపై, ఆధిపత్యం చెలాయించడానికి, అమాయక ప్రజలపై తప్పుడు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేస్తున్నారని సామాన్య ప్రజల నుండి అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఈ విషయంలో, ఇటీవల వరంగల్‌లో పనిచేసిన ఒక ఏసీపీ, మట్వాడా స్టేషన్ లో పనిచేసిన ఒక సీఐపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో వారిని సస్పెండ్ చేశారు. కొంతమంది పోలీసు అధికారులు తమ అధికారాలను దుర్వినియోగం చేస్తూ, ప్రజలను భయబ్రాంతులకు, ఆందోళనకు గురి చేస్తున్నారనడానికి ఇది స్పష్టమైన రుజువు.’ అని సారయ్య రాసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

అలాగే, గతేడాది మార్చిలో ఖిలా వరంగల్ లో జరిగిన గొర్రెల దహనం ఘటనపై పోలీసులు ఇంతవరకు ఎలాంటి చర్యా తీసుకోలేదని, కనీసం నిందితులను గుర్తించి, అరెస్టు చేయలేదని సారయ్య ఆరోపించారు. పోలీసులు తమ విధుల్లో పారదర్శకత ప్రదర్శించాలని, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ, చట్టబద్ధంగా మసులుకోవాలని ఆ విధంగా పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని సారయ్య డీజీపీని కోరారు.
ఎమ్మెల్సీ సారయ్య ఫిర్యాదు ఇంతకాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న ప్రచ్ఛన్న యుద్ధం నుంచి ప్రత్యక్ష యుద్ధానికి దారి తీస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

అలాగే, కొద్ది రోజుల క్రితం తప్పుడు కేసులు నమోదు చేసిన పోలీసు అధికారులపై శాఖ పరమైన చర్యలు తీసుకున్నందున, బాధితులు, వరంగల్ నగర ప్రజల పక్షాన డీజీపీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Latest News

అదిరింది గీ ఐడియా!?|ADUGU TRENDS

గా శ్రీశ్రీ ఏమన్నడు? అగ్గి పుల్ల, సబ్బు బిల్ల కాదేదీ కయితలకనర్హం అన్నడు. అవు మల్ల నిజమే కదా? కావాల్నంటే గీ వాడి పడేసే డబ్బాను దర్జాగా వాడుతున్న గీ అన్నను సూత్తే...

రాజధాని-రాజకీయాలు!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఆమోదం లభించింది. అయితే గత పుష్కరకాలంగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో రాజధాని అంశం అత్యంత వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాజధాని నిర్మాణం...

03-04-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.10 వరకు ఉపరి విదియ నక్షత్రం చిత్త సాయంత్రం 06.03 వరకు ఉపరి స్వాతి యోగం వ్యాఘాత మధ్యాహ్నం 01.05 వరకు ఉపరి హర్షణ కరణం కౌలవ ఉదయం 07.10...

పాత పోన్లల్ల బంగారం!?|ADUGU TRENDS

అవునుల్లా...నిజమే! గా పాత పోన్లు బంగారమే. గా పోన్లల్ల కెల్లి ఎల్లే, గా బంగారమసొంటి పొరతోటి, బంగారం లెక్క బ్రాస్ లెట్లు, కడాలు తయారు చేసుకుంటాండ్లు. కావాలంటే మీరే సూడుండ్లి. ఇగో గీ యన్న.....

సంక్లిష్టంగా పశ్చిమాసియా సంక్షోభం|EDITORIAL

పశ్చిమాసియాలో సమసినట్లే కనిపించిన యుద్ధం మళ్లీ ఎగసిపడుతోంది. కొంగ జపాలు, దొంగ తపాలు తప్ప యుద్ధం ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. యుద్ధ విరమణ, శాంతి ప్రవచనాలు, రాజీ మార్గాలు రానురాను మూసుకుపోతున్నాయి....

02-04-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం హనుమత్ విజయోత్సవము తిధి పౌర్ణమి ఉదయం 06.30 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం హస్త సాయంత్రం 04.35 వరకు ఉపరి చిత్త యోగం ధ్రువ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి వ్యాఘాత కరణం బవ ఉదయం...

వాడి పడేసిన పీపానే పొయ్యి!?|ADUGU TRENDS

ఏడ సూడు, గాస్ ముచ్చట్లే! గీ కాలంల గాస్ లేకుంటే వంట కాదాయే. గా యుద్ధం సేయబట్టి గాస్ దొరుకుడు బందైతాండె. ముందుకుపోత నుయ్యి, ఎనకకుపోతే గొయ్యి లాగే, మల్లా గా కట్టెల...

సీట్ల పెంపే కాదు, సంస్కరణలు కావాలి!|EDITORIAL

భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అతిపెద్దది. కానీ, ఎన్నికల వ్యవస్థలోని లోపాలు మన రాజ్యాంగ ప్రామాణికతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పార్లమెంట్, అసెంబ్లీ సీట్ల పెంపు వంటి చర్యలు సమస్యలకు అసలైన పరిష్కారాలు కావు. నిజమైన...

01-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి చతుర్దశి ఉదయం 06.21 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం ఉత్తర పగలు 03.35 వరకు ఉపరి హస్త యోగం వృద్ధి పగలు 02.21 వరకు ఉపరి ధ్రువ కరణం వణజి ఉదయం 06.21...

నిర్బంధ నిశీధిలో ‘మిణుగురు’ రేణుక!|RED SALUTE|GUMMADAVELLI RENUKA

-విప్లవ స్ఫూర్తి... చైతన్య దీప్తి -మిడ్కో మొదటి వర్ధంతి నేడు హైదరాబాద్, మార్చి 30 (అడుగు న్యూస్): విప్లవోద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి, సాహిత్యంతో సమాజాన్ని ఆలోచింపజేసిన గుమ్మడవెల్లి రేణుక అలియాస్ మిడ్కో బలిదానానికి అప్పుడే...

కలుపు సులువుగ తీసే ఇకమతు!|ADUGU TRENDS

పంట సేన్ల కలుపు సహజం. కనీ గదాన్ని తీసుడే మస్తు తిప్పలు. కూలోల్ల ని పెట్టాలె. మొక్క మొక్క పీకాలే. రోజుల తరబడి సేయాలే. మస్తు పైసలు ఖర్చు సేయాలే. ఇగ గదంతా...

జలం – జనం – జీవనం!|EDITORIAL

భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం. ప్రపంచ జనాభాలో 18% మంది భారతదేశంలో నివసిస్తున్నప్పటికీ, ప్రపంచ మంచి నీటి వనరుల్లో మన వాటా కేవలం 4% మాత్రమే ఉండటం ఆందోళనకరం. ఈ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News