Friday, April 3, 2026
33.2 C
Hyderabad

బీజేపీకి రే‘వంతు’!?|CM|REVANTH REDDY|BJP|TDP|CONGRESS

బడే భాయ్ కి చోటా భాయ్ అలాయ్ బలాయ్?
కమలానికి దూరమంటూనే కేంద్రానికి దగ్గర!
52సార్లు ఢిల్లీకి వెళ్ళొచ్చిన సీఎం రేవంత్ రెడ్డి!
KALESHWARAM|కాళేశ్వరం విచారణను CBI|సీబీఐకి అప్పగింతలో ఔచిత్యం?
BRS|బీఆర్ఎస్ పార్టీని రేవంత్, NARENDRA MODI|మోదీ కాళ్ళ దగ్గర పడేశారా?
గతంలో బీఆర్ఎస్ అనుసరించిన విధానం ఇదే!
ఇప్పుడు రేవంత్ రెడ్డి అనుకరిస్తున్నది కూడా అదే?

‘నా స్కూల్ బీజేపీ, నా కాలేజీ టీడీపీ, నా ఉద్యోగం కాంగ్రెస్’ ఇవి ఆ మధ్య సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. తాను చదివిన విద్యా సంస్థల పట్ల ఏ విద్యార్థికైనా సహజంగానే ‘అభిమానం’ ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న చోట ‘కట్టుబాటు’ ఉంటుంది. సాధారణంగా ఎవరైనా తాము చదివిన విద్యా సంస్థల పట్ల ‘కమిట్ మెంట్’ ను కొనసాగిస్తూనే, ఉద్యోగాలను ‘కట్టుబాటు’తో చేస్తూంటారు. ఇప్పుడు పై వ్యాఖ్యలు చేసిన, రాజకీయ విద్యార్థి రేవంత్ రెడ్డికి అన్వయించి చూడండి. సరిగ్గా ప్రస్తుతం రేవంత్ రాజకీయ శైలి ఇలాగే అ(క)నిపిస్తుంది కదూ!
తనకు ప్రాథమిక రాజకీయ విద్యనందించిన బీజేపీ పట్ల ఉండాల్సిన తీరులోనే ‘కన్సర్న్’గా ఊంటూ, ప్రస్తుతం ప్రభావితంగా కనిపించని టీడీపీని పట్టించుకోకుండా, తనకు సీఎం ఉద్యోగాన్నిచ్చిన కాంగ్రెస్ తో ‘కమిట్ మెంట్’గా పని చేస్తున్నారు.
అయితే, పెద్దగా తేడాలేని జీవితం, రాజకీయం, ‘రాజీ’కీయాల్లో కన్సర్న్, కమిట్ మెంట్ లతోపాటు సమయానుకూలంగా వ్యవహారించగలిగే ‘కామన్ సెన్స్’ కూడా ముఖ్యం. ఆ నేర్పరి తనం కూడా అవసరం. లౌక్యమన్నా, మరేమన్నా, సరిగ్గా సీఎం ప్రస్తుత రాజకీయాల్లో ‘లౌక్యం’గా వ్యవహరిస్తున్న ‘నేర్పరి’గా మారారు అనడంలో ఎలాంటి సందేహం అక్కరలేదు.

హైదరాబాద్, సెప్టెంబర్ 6 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
తెలంగాణ రాజకీయాల్లో రాష్ట్ర సీఎం కేసీఆర్-బీజేపీ ల మధ్య ‘అవగాహన’ ఉందా? బడే భాయ్, చోటే భాయ్ లు అలాయ్ బలాయ్ తీసుకుంటున్నారా? పరస్పరం సహకరించుకుంటున్నారా? అవును పక్కా ప్లాన్ ప్రకారమే రేవంత్, కాంగ్రెస్ లు కలిసి బీఆర్ఎస్ ను తొక్కి పడేస్తున్నాయని ఆ పార్టీ నేతలు నెత్తినోరు మొత్తుకుంటున్నారు. కానీ, బీజేపీ మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ లు ఒక్కటేనని పదే పదే విమర్శిస్తోంది.
సీఎం రేవంత్ రెడ్డి మాత్రం బీజేపీ, బీఆర్ఎస్ అనుబంధాన్ని మరో రకంగా విడమరిచారు. బీఆర్ఎస్ లోనే బీ ‘ఆర్ ఎస్ ఎస్’ ఉందంటున్నారు. రెండు పార్టీలు కాంగ్రెస్ పై దండయాత్ర చేశాయంటున్నారు. 2024 ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి స్నేహపూర్వక పోటీనిస్తూ, పూర్తిగా తమ ఓట్లను బీజేపీకే వేయించిందని ఆరోపించారు. దీన్ని ఆయన కొన్ని లెక్కలతో తేల్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్ల శాతం -37.5. అదే 2024 పార్లమెంటు ఎన్నికల్లో -16.5 శాతానికి పడిపోయింది, ఇక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 13% ఓట్లు రాగా, లోకసభ ఎన్నికల్లో 35.5 శాతానికి పెరిగింది, ఇదెలా సాధ్యమని రేవంత్ విశ్లేషిస్తున్నారు.
తర్వాతి పరిణామాల్లో గతంలో అధికారంలో ఉండగా, బీజేపీతో బీఆర్ఎస్ వ్యవహరించిన తీరుగానే రేవంత్ కూడా బీజేపీతో వ్యవహరిస్తున్నారు. దక్షిణాదిలో అంతగా పట్టు లేని బీజేపీ, కేంద్రంలో ఉన్న అధికారంతో మొత్తం దేశంలోనే ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నది. దీంతో ఒక రాష్ట్రానికే పరిమితమైన సీఎం రేవంత్ రెడ్డి, పూర్తి అవగాహనతోనే, కుశాగ్ర బుద్ధితో వ్యవహరిస్తున్నారా? తన పరిధి, పరిమితిలోనే తనకు ‘స్కూల్ ఎడ్యుకేషన్’ ప్రాథమిక విద్యనందించిన బీజేపీతో బాగుంటూనే, ఇటు పదవిని కాపాడుకుంటూనే, అటు అధిష్టానాన్ని మెప్పిస్తూనే, బీఆర్ఎస్ ను కట్టడి చేస్తున్నారా? ఇంకో రకంగా చెప్పాలంటే, ‘మహా’నుభవాలతో బీజేపీతో కూడా బాగానే ఉంటున్నారా? ఆయన వ్యవహారల శైలి మాత్రం ఇందకనుగుణంగానే కనిపిస్తున్నది. ఈ టర్మ్ పదవిని పదిలం చేసుకున్నట్లుగా ఆయన ఇటీవలి మాటలే చెబుతున్నాయి. కేజ్రీవాల్ లాగా వచ్చే, ఆ మల్లొచ్చే టర్మ్ కోసమే సీఎం పదవిపై రేవంత్ యమ ‘క్రేజీ వాలా’లా మారినట్లు కనిపిస్తున్నది.
అందుకే గతంలో అధికారంలో ఉన్న పదేళ్లు బీఆర్ఎస్ కాంగ్రెస్ పట్ల వ్యవహరించిన తీరులాగే, అందుకు కొంత భిన్నంగా, కాంగ్రెస్ అధిష్ఠాన అభీష్టానికి విభిన్నంగా, ఒప్పిస్తూ, మెప్పిస్తూనే ఇప్పుడు రేవంత్ రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నట్లుగా ఉంది. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ఓటు బ్యాంకును కలిగిన ఉన్న కాంగ్రెస్ ను మూడో స్థానానికి పరిమితం చేస్తూ, బీజేపీ పుంజుకునే విధంగా చూశారు. ఆసఖ్యత రాష్ట్రంలో తమకు ఇబ్బందీ లేని, రాని ఎంపీ సీట్లల్లో బీజేపీని గెలిపించేదాకా, కొన్ని అసెంబ్లీ సీట్లకు సర్దుబాటు వరకు వెళ్ళింది. రాష్ట్రంలో కేంద్రంతో మాత్రం కేసీఆర్ ‘ఇగో’కు పోయారు. కేసీఆర్ కు మించిన ‘ఇగోయిస్టు’ అయినప్పటికీ, రేవంత్ ఇప్పుడు ఆ ‘ఇగో’ని పక్కన పెట్టేశారు. పైగా ఆయనే చెప్పుకున్నట్లు, తనకు ‘ప్రాథమిక’ రాజకీయానుభవం నేర్పింది బీజేపీ కావడంతో ‘సర్దుకు పోదాంలే’ అనుకోవడానికి రేవంత్ కు పెద్దగా ఇబ్బందీ కావడంలేదు.
ఇక రేవంత్, బీజేపీ సఖ్యతతో బీఆర్ఎస్ ని కట్టడి చేస్తున్నారు. బీజేపీకి కూడా బీఆర్ఎస్ ‘అణగి మణగి’ ఉండటమే కావాలి. అలాగని అవసరాన్ని బట్టి రేవంత్ రెడ్డీ, బీఆర్ఎస్ లు కూడా తమ చెప్పుచేతల్లోనే ఉండాలి. అందుకే కాంగ్రెస్ తో వైరమున్నా, రేవంత్ రెడ్డిని చేరదీస్తూనే, బీఆర్ఎస్ ను కాళేశ్వరం అవినీతి కేసును సీబీఐకి అప్పగింప చేయడం ద్వారా కేసీఆర్ నే తమ కాళ్ళ దగ్గర పడేటట్లు చేసుకుంది బీజేపీ. ఇది బీజేపీ రాజకీయ చాణక్యం.
కాళేశ్వరం అవినీతికి కేసును సీబీఐకి అప్పగించడం ఇందులో భాగమే. గతంలో లిక్కర్ కేసులో కవిత అరెస్టు వ్యవహారంలో, కవితను విడుదల చేస్తే, బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తామనేదాకా వెళ్ళింది. అలాగే కాళేశ్వరం కేసులో కూడా ముందుగా సీబీఐ వంతు, తర్వాత ఈడీలు కల్పించుకుంటుంది. తర్వాత కేసీఆర్ కుటుంబాన్ని బీజేపీ, పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంటుంది. ఒకవేళ అరెస్టులు ఆగినా, జరిగినా, ఫలితం మాత్రం ఇలాగే ఉంటుంది. మరి రేవంత్ రెడ్డి బీజేపీతో ఇలా వ్యవహరించడం కాంగ్రెస్ అధిష్టానానికి, అధి నాయకత్వానికి ఇష్టమున్నా, లేకపోయినా చేసేదేమీ ఉండదు. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నదే రెండు మూడు రాష్ట్రాల్లో. మొండిగా వ్యవమరించి ఇది కూడా ఊడితే? అంతే సంగతులు. మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఏం జరిగిందో గుర్తుందిగా! నేషనల్ హెరాల్డ్ వంటి రకరకాల కేసులతో ‘ఆర్థిక దిగ్బంధనం’లో గాంధీల కుటుంబం ఉంది. పైగా జాతీయ స్థాయిలో పార్టీని నడిపే చోదక శక్తి ఎక్కడి నుండి వస్తుంది?
సీఎం రే‘వంతు’ వరకొస్తే, ఇదంతా ఈ ‘టర్మ్’ రాజకీయం. మళ్ళీ ఎన్నికలు వచ్చేనాటికి అప్పటి పరిస్థితులను బట్టి, అప్పటి ఎత్తుగడలు ఉంటాయి. అప్పటి దాకా వేచి చూడటం, సమయానుకూలంగా నడుస్తూ పోవడమే రాజకీయ పార్టీల పని. ఇంకా అప్పటి దాకా తమ శ్రేణులు, కార్యకర్తలు, నేతలు తమను వీడి పోకుండా, గ్రాఫ్ పడి పోకుండా ఉండటానికే ఈ రాజకీయ ఎత్తుగడలు తప్పితే. ఇందులో నువ్వా? నేనా? అనే రాజకీయం లేదు. పోటా పోటీ పోరాటం కూడా లేదు. జస్ట్ మైండ్ గేమ్ అంతే!

Latest News

అదిరింది గీ ఐడియా!?|ADUGU TRENDS

గా శ్రీశ్రీ ఏమన్నడు? అగ్గి పుల్ల, సబ్బు బిల్ల కాదేదీ కయితలకనర్హం అన్నడు. అవు మల్ల నిజమే కదా? కావాల్నంటే గీ వాడి పడేసే డబ్బాను దర్జాగా వాడుతున్న గీ అన్నను సూత్తే...

రాజధాని-రాజకీయాలు!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఆమోదం లభించింది. అయితే గత పుష్కరకాలంగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో రాజధాని అంశం అత్యంత వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాజధాని నిర్మాణం...

03-04-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.10 వరకు ఉపరి విదియ నక్షత్రం చిత్త సాయంత్రం 06.03 వరకు ఉపరి స్వాతి యోగం వ్యాఘాత మధ్యాహ్నం 01.05 వరకు ఉపరి హర్షణ కరణం కౌలవ ఉదయం 07.10...

పాత పోన్లల్ల బంగారం!?|ADUGU TRENDS

అవునుల్లా...నిజమే! గా పాత పోన్లు బంగారమే. గా పోన్లల్ల కెల్లి ఎల్లే, గా బంగారమసొంటి పొరతోటి, బంగారం లెక్క బ్రాస్ లెట్లు, కడాలు తయారు చేసుకుంటాండ్లు. కావాలంటే మీరే సూడుండ్లి. ఇగో గీ యన్న.....

సంక్లిష్టంగా పశ్చిమాసియా సంక్షోభం|EDITORIAL

పశ్చిమాసియాలో సమసినట్లే కనిపించిన యుద్ధం మళ్లీ ఎగసిపడుతోంది. కొంగ జపాలు, దొంగ తపాలు తప్ప యుద్ధం ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. యుద్ధ విరమణ, శాంతి ప్రవచనాలు, రాజీ మార్గాలు రానురాను మూసుకుపోతున్నాయి....

02-04-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం హనుమత్ విజయోత్సవము తిధి పౌర్ణమి ఉదయం 06.30 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం హస్త సాయంత్రం 04.35 వరకు ఉపరి చిత్త యోగం ధ్రువ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి వ్యాఘాత కరణం బవ ఉదయం...

వాడి పడేసిన పీపానే పొయ్యి!?|ADUGU TRENDS

ఏడ సూడు, గాస్ ముచ్చట్లే! గీ కాలంల గాస్ లేకుంటే వంట కాదాయే. గా యుద్ధం సేయబట్టి గాస్ దొరుకుడు బందైతాండె. ముందుకుపోత నుయ్యి, ఎనకకుపోతే గొయ్యి లాగే, మల్లా గా కట్టెల...

సీట్ల పెంపే కాదు, సంస్కరణలు కావాలి!|EDITORIAL

భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అతిపెద్దది. కానీ, ఎన్నికల వ్యవస్థలోని లోపాలు మన రాజ్యాంగ ప్రామాణికతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పార్లమెంట్, అసెంబ్లీ సీట్ల పెంపు వంటి చర్యలు సమస్యలకు అసలైన పరిష్కారాలు కావు. నిజమైన...

01-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి చతుర్దశి ఉదయం 06.21 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం ఉత్తర పగలు 03.35 వరకు ఉపరి హస్త యోగం వృద్ధి పగలు 02.21 వరకు ఉపరి ధ్రువ కరణం వణజి ఉదయం 06.21...

నిర్బంధ నిశీధిలో ‘మిణుగురు’ రేణుక!|RED SALUTE|GUMMADAVELLI RENUKA

-విప్లవ స్ఫూర్తి... చైతన్య దీప్తి -మిడ్కో మొదటి వర్ధంతి నేడు హైదరాబాద్, మార్చి 30 (అడుగు న్యూస్): విప్లవోద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి, సాహిత్యంతో సమాజాన్ని ఆలోచింపజేసిన గుమ్మడవెల్లి రేణుక అలియాస్ మిడ్కో బలిదానానికి అప్పుడే...

కలుపు సులువుగ తీసే ఇకమతు!|ADUGU TRENDS

పంట సేన్ల కలుపు సహజం. కనీ గదాన్ని తీసుడే మస్తు తిప్పలు. కూలోల్ల ని పెట్టాలె. మొక్క మొక్క పీకాలే. రోజుల తరబడి సేయాలే. మస్తు పైసలు ఖర్చు సేయాలే. ఇగ గదంతా...

జలం – జనం – జీవనం!|EDITORIAL

భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం. ప్రపంచ జనాభాలో 18% మంది భారతదేశంలో నివసిస్తున్నప్పటికీ, ప్రపంచ మంచి నీటి వనరుల్లో మన వాటా కేవలం 4% మాత్రమే ఉండటం ఆందోళనకరం. ఈ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News