Friday, April 3, 2026
32.2 C
Hyderabad

Bc|బలహీన వర్గాలకు న్యాయం చేయడమే Government|ప్రభుత్వ లక్ష్యం|Goal

Assembly|శాసనసభలో CM|ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి|Revanth Reddy

తెలంగాణ శాసనసభ బీసీ రిజర్వేషన్ల అంశంపై జరిగిన చర్చలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, బలహీన వర్గాలకు అనుమానం కలిగేలా అబద్ధపు ప్రచారాలు చేయొద్దని మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ను కోరారు. Resrvations|రిజర్వేషన్ల విషయంలో తమ ప్రభుత్వమే చిత్తశుద్ధితో ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. మొదట బీసీల వివరాలను సేకరించే బాధ్యత STATE BC COMMISSION|రాష్ట్ర బీసీ కమిషన్‌కు అప్పగించామని చెప్పారు. అయితే, బీసీ కమిషన్ కాకుండా ప్రత్యేక డెడికేషన్ కమిషన్|DEDICATION COMMISSION ద్వారా సమాచార సేకరణ జరగాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య హైకోర్టులో రిట్ పిటిషన్ (30381/2024) వేశారని, ఆ పిటిషన్ విచారణ అనంతరం హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిందని ఆయన చెప్పారు. ఈ ఆదేశాలు వచ్చిన వెంటనే చిత్తశుద్ధితో డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి కుల సర్వే చేపట్టామని ఆయన తెలిపారు. బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశ్యంతోనే ఈ కుల సర్వే జరిపామని ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల అనుభవాలను పరిశీలించి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకున్నామని, అధికారుల కమిటీని, మంత్రులను బీహార్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు పంపించి సమాచారాన్ని సేకరించామని ఆయన శాసనసభ్యులకు వివరించారు. న్యాయపరమైన సమస్యలను విశ్లేషించిన తరువాతే డెడికేషన్ కమిషన్ నియమించామని చెప్పారు. అలాగే ఈ ప్రక్రియను 2024 ఫిబ్రవరి 4న ప్రారంభించి 2025 ఫిబ్రవరి 4న పూర్తిచేశామని, ఏడాదిలో పకడ్బందీగా చట్టాన్ని రూపొందించి స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఈ మేరకు మంత్రివర్గ తీర్మానం చేసి, శాసనసభలో ఆమోదం పొంది రెండు వేర్వేరు బిల్లులను గవర్నర్‌కు పంపించామని తెలిపారు. అయితే, గవర్నర్ వాటిని ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపారని, ఆ బిల్లులు గత ఐదు నెలలుగా రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ఈలోగా స్థానిక సంస్థల ఎన్నికలపై కొందరు హైకోర్టును ఆశ్రయించగా, సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని ఆయన తెలిపారు. 2018లో కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఇప్పుడు గుదిబండగా మారిందని విమర్శించారు. అందుకే తమ ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపంలో 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేసే చర్యలు తీసుకువచ్చిందని, కానీ గవర్నర్ ఆ ఆర్డినెన్స్‌ను కూడా రాష్ట్రపతికి పంపారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెరవెనక లాబీయింగ్ కారణంగానే ఆర్డినెన్స్ ఆమోదం పొందలేదని, అత్యవసరమైతే బిల్లును తిరిగి సభలో ఆమోదించుకుంటామని చెప్పారు. బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం పట్ల గంగుల కమలాకర్ సంతోషంగా ఉన్నారని, కానీ ఆయన పార్టీ నాయకులు మాత్రం అసంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. బీసీ కమిషన్ గానీ, డెడికేషన్ కమిషన్ గానీ ఏది అయినా తమ ఉద్దేశం బలహీన వర్గాలకు న్యాయం చేయడమేనని స్పష్టం చేశారు. అదే సమయంలో, ఢిల్లీకి అఖిలపక్ష బృందాన్ని తీసుకెళ్లలేదని GANGULA KAMALAKAR|గంగుల కమలాకర్ ఆరోపణలపై స్పందిస్తూ, ప్రధానికి ఐదుసార్లు లేఖ రాసినా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని, అందుకే జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టామని తెలిపారు. ఆ ధర్నాకు వివిధ రాష్ట్రాల 100 మంది ఎంపీలు మద్దతు ఇచ్చారని, అయితే బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు మాత్రం పాల్గొనలేదని విమర్శించారు. దీంతో BRS|బీఆర్ఎస్‌కు బీసీలపై చిత్తశుద్ధి ఉందో…లేదో… అర్థమవుతుందని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇప్పుడు కూడా సభలో గందరగోళం సృష్టించి బిల్లులు ఆమోదం పొందకుండా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారికి కనువిప్పు కలిగించేలా ఫిబ్రవరి 4ను సోషల్ జస్టిస్ డే|Social Justice Day|గా జరుపుకోవాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి ప్రకటించారు. వందేళ్లుగా చేయని పనిని తమ ప్రభుత్వం ప్రారంభించిందని, ఆ ప్రయత్నాన్ని అభినందించాల్సింది పోయి అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. గంగుల కమలాకర్ బలహీన వర్గాల ప్రయోజనాల విషయంలోనైనా ఒత్తిడులకు లొంగరాదని కోరారు. బలహీన వర్గాలు ఒకరినొకరు అవమానించుకోవడం మానుకుని ఏకతాటిపై రావాలని సూచించారు. మొత్తంగా, బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని, ఈ లక్ష్యానికి అనుగుణంగానే అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు.

Latest News

అదిరింది గీ ఐడియా!?|ADUGU TRENDS

గా శ్రీశ్రీ ఏమన్నడు? అగ్గి పుల్ల, సబ్బు బిల్ల కాదేదీ కయితలకనర్హం అన్నడు. అవు మల్ల నిజమే కదా? కావాల్నంటే గీ వాడి పడేసే డబ్బాను దర్జాగా వాడుతున్న గీ అన్నను సూత్తే...

రాజధాని-రాజకీయాలు!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఆమోదం లభించింది. అయితే గత పుష్కరకాలంగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో రాజధాని అంశం అత్యంత వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాజధాని నిర్మాణం...

03-04-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.10 వరకు ఉపరి విదియ నక్షత్రం చిత్త సాయంత్రం 06.03 వరకు ఉపరి స్వాతి యోగం వ్యాఘాత మధ్యాహ్నం 01.05 వరకు ఉపరి హర్షణ కరణం కౌలవ ఉదయం 07.10...

పాత పోన్లల్ల బంగారం!?|ADUGU TRENDS

అవునుల్లా...నిజమే! గా పాత పోన్లు బంగారమే. గా పోన్లల్ల కెల్లి ఎల్లే, గా బంగారమసొంటి పొరతోటి, బంగారం లెక్క బ్రాస్ లెట్లు, కడాలు తయారు చేసుకుంటాండ్లు. కావాలంటే మీరే సూడుండ్లి. ఇగో గీ యన్న.....

సంక్లిష్టంగా పశ్చిమాసియా సంక్షోభం|EDITORIAL

పశ్చిమాసియాలో సమసినట్లే కనిపించిన యుద్ధం మళ్లీ ఎగసిపడుతోంది. కొంగ జపాలు, దొంగ తపాలు తప్ప యుద్ధం ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. యుద్ధ విరమణ, శాంతి ప్రవచనాలు, రాజీ మార్గాలు రానురాను మూసుకుపోతున్నాయి....

02-04-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం హనుమత్ విజయోత్సవము తిధి పౌర్ణమి ఉదయం 06.30 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం హస్త సాయంత్రం 04.35 వరకు ఉపరి చిత్త యోగం ధ్రువ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి వ్యాఘాత కరణం బవ ఉదయం...

వాడి పడేసిన పీపానే పొయ్యి!?|ADUGU TRENDS

ఏడ సూడు, గాస్ ముచ్చట్లే! గీ కాలంల గాస్ లేకుంటే వంట కాదాయే. గా యుద్ధం సేయబట్టి గాస్ దొరుకుడు బందైతాండె. ముందుకుపోత నుయ్యి, ఎనకకుపోతే గొయ్యి లాగే, మల్లా గా కట్టెల...

సీట్ల పెంపే కాదు, సంస్కరణలు కావాలి!|EDITORIAL

భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అతిపెద్దది. కానీ, ఎన్నికల వ్యవస్థలోని లోపాలు మన రాజ్యాంగ ప్రామాణికతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పార్లమెంట్, అసెంబ్లీ సీట్ల పెంపు వంటి చర్యలు సమస్యలకు అసలైన పరిష్కారాలు కావు. నిజమైన...

01-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి చతుర్దశి ఉదయం 06.21 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం ఉత్తర పగలు 03.35 వరకు ఉపరి హస్త యోగం వృద్ధి పగలు 02.21 వరకు ఉపరి ధ్రువ కరణం వణజి ఉదయం 06.21...

నిర్బంధ నిశీధిలో ‘మిణుగురు’ రేణుక!|RED SALUTE|GUMMADAVELLI RENUKA

-విప్లవ స్ఫూర్తి... చైతన్య దీప్తి -మిడ్కో మొదటి వర్ధంతి నేడు హైదరాబాద్, మార్చి 30 (అడుగు న్యూస్): విప్లవోద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి, సాహిత్యంతో సమాజాన్ని ఆలోచింపజేసిన గుమ్మడవెల్లి రేణుక అలియాస్ మిడ్కో బలిదానానికి అప్పుడే...

కలుపు సులువుగ తీసే ఇకమతు!|ADUGU TRENDS

పంట సేన్ల కలుపు సహజం. కనీ గదాన్ని తీసుడే మస్తు తిప్పలు. కూలోల్ల ని పెట్టాలె. మొక్క మొక్క పీకాలే. రోజుల తరబడి సేయాలే. మస్తు పైసలు ఖర్చు సేయాలే. ఇగ గదంతా...

జలం – జనం – జీవనం!|EDITORIAL

భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం. ప్రపంచ జనాభాలో 18% మంది భారతదేశంలో నివసిస్తున్నప్పటికీ, ప్రపంచ మంచి నీటి వనరుల్లో మన వాటా కేవలం 4% మాత్రమే ఉండటం ఆందోళనకరం. ఈ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News