ట్రాఫిక్ జామ్‌తో భక్తులకు ఇబ్బంది
ప్రయాగ్రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా సందర్భంగా కోటికి పైగా భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసి పూజలు నిర్వహిస్తున్నారు. భక్తుల రద్దీతో మేళా ప్రాంతం కళకళలాడుతోంది.
భక్తుల సంఖ్య పెరగడంతో నదీ శుభ్రతకూ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మున్సిపల్ సిబ్బంది క్లీనింగ్ మెషీన్ల సహాయంతో భక్తులు కొడుతున్న కొబ్బరికాయలు, ముడుపులు, ఇతర వ్యర్థాలను వెంటనే తొలగిస్తూ నదీ నీటిని శుభ్రంగా ఉంచుతున్నారు. ఈ శుభ్రతా కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
అంతేకాకుండా, మహాకుంభమేళాకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చిన కారణంగా ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఏర్పడింది. ఉత్తరప్రదేశ్-మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో సుమారు 50 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో లక్షలాది మంది భక్తులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వ అధికారులు ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

