పిల్లలు, ముసలోల్లు తప్పిపోతే దొరకబట్టడానికి పోలీసులు మొన్నామద్దెల ఓ ఉపాయం శేసిండ్లు. ‘చిల్డ్రన్ ట్రాకింగ్ అండ్ మానిటరింగ్ సిస్టమ్’ పేరుతోటి శేతికి కంకణం లెక్క, గడియారం లెక్క రిస్టు బాండ్లను గా పిల్లలకు, ముసలోల్ల శేతికి తగిలిస్తరు. ఇగ గ వాళ్ళు తప్పిపోతే, గదాన్ని పోన్ల స్కాన్ శేసి, డీ కోడ్ చేస్తే గవాళ్ళ యివరాలు గండ్ల కనబ్తయి. గిదీనికి ముందే, గ వాల్ల యివరాలను రాసుకుని, కంప్యూటర్ల బెట్టాలె. లేకపోతే లేదు. గీ శాట బారతం లేకుండా, నయా పైస కర్సు లేకుండ ఓ అవ్వ మస్తు ఇకమతు శేసింది.
పిల్లాగాల్లతోటి గామె మేడారం జాతరకొచ్చింది. పిల్లలు తప్పిపోతే దొరకడానికి, గా పిల్లల శేతుల మీద పోను నెంబర్లు రాసింది! తప్పిపోతే గా నెంబర్లకు పోను చేయించాలని శెప్పింది. గిది శూసి గా పోలీసోల్లే మస్తు పరేషాన్ అయితాండ్లు. కర్సు, కట్టం లేని ఉపాయం బలే శేసింది కదా?
తప్పిపోతే, శిడెంల దొరుకుతరు?!|ADUGU TRENDS

