తాగి పారేసిన మంచినీల్ల సీసల్ని ఏం సేత్తం? మా అంటే మల్లోపాలి ఆడ్తం. కొందరైతే మల్ల మల్ల ఎవలికి నచ్చినట్లు వాల్లాడతరు. లేకపోతే పాత ప్లాస్టిక్ సామానోల్లకేత్తం. గనీ, గిట్లనైతే అస్సలు ఆలోసించం.

మంచినీల్ల సీసను తీసుకుని, దాని మూతి కెలి కొంచెం దూరం కత్తిరిచ్చిండు. గదాన్ని ఓ కట్టెకు బిర్రుగ ఎక్కిచ్చిండు. గదాన్ని కొంచెం కాల్సి, మరింత బిర్రుగ దానికి అతికిపిచ్చిండు. ఇగ దాని మూతను తీసి, గోడకు సిన్న స్క్రూని గట్టిగ తిప్పిండు. ఇగ గదానికి ఇందాకటి కట్టెను గా మూతకు తిప్పి బిగించిండు. అయిపాయె! ఇగ శిలుక్కొయ్య తయారైంది. గదేనుల్లా హ్యాంగరంటాండ్లు గదా గదే! మంచిగుంది గద గీ ఇకమతు. మీరు గూడ శేయిండ్లి!

