
శేన్లకు పురుగు పట్టుడు. గా పురుగుల మందు కొట్టుడు రైతులకు ఎప్పుడుండే తిప్పలే. కనీ గా పురుగు పట్టినట్లు గుర్తు పడితెనే కదా? మందు కొట్టేది? ఇగ పురుగులు గూడ ఆకులెక్కనే ఉంటానయట. గవాటిని గుర్తుపట్టడం కట్టమేనట.
గిసొంటిదే ఒకటి యెలుగు సూసింది. పురుగు తిన్న ఆకు లెక్కనే ఉన్నది. గదాన్ని సూస్తే ఆకే అనుకుంటం. ఇగ గా ఆకే కదాని వదిలేయకుండ… బాగా పరిశీలనగ తదేకంగా సూస్తే. గదాన్ని కిందికి, మీదికి అటు ఇటేయంగ… మెల్లగ కదిలింది. కాళ్లు రెక్కలను యిప్పింది. ఓర్నీ గది సూస్తే పురుగు తిన్న ఆకు లెక్కనే ఉండె. గిదేంది పురుగా? అని ఇచ్చెంత్ర పోతాండ్లు రైతులు. రైతన్నలూ… జెర జాగ్రత్త! గీ ఆకు లెక్కనే ఉండే ఆకు పురుగులతోటి…

