
మనం తయ్యారుగున్న రెడీ మేడ్ బట్టల్ని కొంటున్నం. గయయితే, గిట్ల కొని, గట్ల ఏసుకోవచ్చు. దకుణంలకు పోయి బట్టను కొనుడు, గవాట్ని పట్టుకుని మేరాయన దగ్గరికి పోవుడు, కొలతలిచ్చుడు. గాయినకు తీరినప్పుడు కట్టిచ్చినంక, గయి కుట్టుడు కుదరకపోతే కుట్లు గటేసి, గిటేసి గిప్పుడైతే ఎవ్వలు ఆగమైతలేరు. కనీ, గా కొత్తగ కొనే బట్టలకు ట్యాగులెందుకేస్తరు గదా? గయి ఎందుకేస్తరో తెలుసా?
గా బట్టల్ని ఎవ్వలు ఎత్తుకపోకుండనట! కొన్నంక గా ట్యాగులు తీసి, గా బట్టల దుకుణపోల్లు మనకిస్తరు. ఒకేళ ఎవ్వలైనా గా బట్టల్ని ఎత్తుకపోతే, గా ట్యాగుల్ని తీసుడు మన నుంచి గాదట. గది తీయ్యకపోతే బట్టలేసుకోరాదు. అటిటు జేసి గా ట్యాగును పగుల కొడితిమా? గండ్ల గింతంత రంగునీళ్ళుంటయట. గా ట్యాగు పగలంగనే గా రంగు గా బట్టల మీద పడతదట. ఇగ కొత్త బట్టల్లెక్కనే గవి ఉండయన్నట్లు. వామ్మో! ట్యాగుల ఎనుక గింత కతుందుల్లా?

