
గీ డౌటు నాకే కాదుల్లా… ! గీ ఇంటిని సూత్తె.. మీక్కూడా ఒత్తది. మొత్తం రైలు లెక్కనే ఇల్లు కట్టిండు. గవే రంగులేసిండు. గట్లనే కిటికీలు పెట్టిండు. దర్వాజలు, తలుపులు గూడ గట్లనే శేపిచ్చిండు. ఇగ గా ఇంటిని సూసి నేను, మీరే గాదుల్లా… ఎవ్వలైనా గదాన్ని రైలే అంటరు. కనీ గది ఇల్లు.
గా ఇంటిని కట్టించుకున్నాయినె రైల్లల్ల పని శేత్తడో? లేకపోతే గా రైలంటే ఇట్టమో! గనీ, గా రైలు డబ్బాల్లెక్కనే ఇల్లు కట్టిండు. గా ఊర్లెకు పోయినల్లా… గా ఇంటిని సూసి వత్తాండ్లంట. ఔరా ఏం కట్టిండని మెచ్చుకుంటాండ్లట. గది ఎక్కడుందో కనీ, కనుక్కొని, మనం గూడ ఎల్లి సూసొత్తామా?

