Monday, April 6, 2026
35.2 C
Hyderabad

మరీ నేనెట్లా.. ఓడిపోయిన?|PANCHAYATI TRENDS

ఎన్నికలంటే గెలుపోటములు సహజమే. అయితే కొందరికి ఓటమి రాజకీయంగా మాత్రమే కాదు… మానసికంగా కూడా తట్టుకోలేని బాధను మిగిల్చుతుంది. నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం ఔరవాణి గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాలు అలాంటి హృదయవిదారక ఘటనకు దారితీశాయి. తొలి విడతలో జరిగిన ఈ ఎన్నికల్లో 1577 ఓట్లు ఉన్న గ్రామంలో నలుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రధాన పార్టీల మద్దతుదారులతో పాటు ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా పోటీ చేశాడు. చివరకు కాంగ్రెస్ మద్దతుదారుడు జక్కల పరమేష్ విజయం సాధించగా, ఇండిపెండెంట్ అభ్యర్థి బాలరాజు గౌడ్ రెండో స్థానంలో నిలిచాడు. అయితే ఈ ఎన్నికల్లో గెలుపు కోసం బాలరాజు గౌడ్ రూ.10 లక్షలకుపైగా ఖర్చు చేశాడని గ్రామంలో చర్చ జరుగుతోంది. అనూహ్య ఓటమి అతన్ని తీవ్ర మానసిక వేదనకు గురిచేసింది. అప్పు చేసి ఎన్నికల్లో ఖర్చు పెట్టిన తన పరిస్థితిని వివరించుకుంటూ, ఓటు వేస్తామని చెప్పి మోసం చేశారంటూ గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ డబ్బులు తిరిగి ఇవ్వాలని వేడుకుంటున్నాడు. దేవుడి చిత్రపటం చేతబట్టి, భార్య పురుగుల మందు డబ్బా పట్టుకుని ఓటర్లను కోరడం గ్రామంలో కలకలం రేపింది. అందరూ ఓట్లు వేశామంటూ దేవుడిపై ప్రమాణం చేశారు… మరి నేను ఎలా ఓడిపోయాను? అంటూ అభ్యర్థి కన్నీటితో విలపించడం చూసి గ్రామస్తులూ విస్తుపోయారు. ఎన్నికల పోరు ఓ కుటుంబాన్ని ఎంత బాధలోకి నెట్టిందో… చూసిన ప్రజలు ఒక్కసారిగా విస్తుపోయారు.

Latest News

06-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ చవితి ఉదయం 11.47 వరకు ఉపరి పంచమి నక్షత్రం అనూరాధ రాత్రి 12.45 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం సిద్ది మధ్యాహ్నం 01.40 వరకు ఉపరి వ్యతీపాత కరణం బాలవ ఉదయం 11.47...

గా ఊల్లె.. అందరికీ ఒకటే వంట!?|ADUGU TRENDS

గా ఊల్లె నిజంగా రోజూ పండుగే? ఎవలింట్లా పొయ్యి ఎలగదు. ఊరంతటికీ ఒకటే పొయ్యి. కులం లేదు మతం లేదు. గా ఊరంతా ఒకటే కుటుంబం. రోజూ అంతా కలిసే ఉంటరు. ఒకదగ్గరనే...

గ్రామాలు బలపడితేనే దేశాభివృద్ధి!|EDITORIAL

మనది గ్రామీణ భారతం. గ్రామాలతోనే దేశం బాగుపడుతుంది. అభివృద్ధి అనగానే “ట్రిలియన్ డాలర్ ఎకానమీ”, “ఫ్యూచర్ సిటీలు” వంటి ఆకర్షణీయమైన లక్ష్యాలు ముందుకు వస్తున్నాయి. అయితే, ఈ లక్ష్యాలు సాధ్యమవ్వాలంటే గ్రామాలు బలపడటం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 05, 2026 నుండి ఏప్రిల్ 11, 2026 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉన్నా ఫలితాలు మంచిగా ఉంటాయి....

గిట్లంటే, గీ గ్యాస్ సిలండర్ మూతొత్తది!?|ADUGU TRENDS

ఇండ్లల్ల గ్యాస్ అయిపోయిందని తెల్వంగనే పక్కన పడేత్తం. కనీ, గా గ్యాస్ అయిపోయిందా? లేదా అని సూడాల్నంటే, గా మూత తీయాలె. గది తీయాల్నంటే మస్తు భయమైతది. కనీ, గా మూత తీసుడు...

యుద్ధం: వాస్తవాలు, అపోహలు, ప్రభావాలు|EDITORIAL

ప్రపంచం వేగంగా మారుతోంది. ఒక చోట చోటు చేసుకునే సంఘటనలు మరో చోట జీవన విధానాన్ని అంతకంటే వేగంగా ప్రభావితం చేస్తున్నాయి. పశ్చిమాసియా యుద్ధం, ఉద్రిక్తతలు వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది....

04-04-2026, శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి శు విదియ ఉదయం 08.22 వరకు ఉపరి తదియ నక్షత్రం స్వాతి రాత్రి 07.58 వరకు ఉపరి విశాఖ యోగం హర్షణ మద్యాహ్నం 01.00 వరకు ఉపరి వజ్ర కరణం గరజి ఉదయం 08.22...

అదిరింది గీ ఐడియా!?|ADUGU TRENDS

గా శ్రీశ్రీ ఏమన్నడు? అగ్గి పుల్ల, సబ్బు బిల్ల కాదేదీ కయితలకనర్హం అన్నడు. అవు మల్ల నిజమే కదా? కావాల్నంటే గీ వాడి పడేసే డబ్బాను దర్జాగా వాడుతున్న గీ అన్నను సూత్తే...

రాజధాని-రాజకీయాలు!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఆమోదం లభించింది. అయితే గత పుష్కరకాలంగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో రాజధాని అంశం అత్యంత వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాజధాని నిర్మాణం...

03-04-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.10 వరకు ఉపరి విదియ నక్షత్రం చిత్త సాయంత్రం 06.03 వరకు ఉపరి స్వాతి యోగం వ్యాఘాత మధ్యాహ్నం 01.05 వరకు ఉపరి హర్షణ కరణం కౌలవ ఉదయం 07.10...

పాత పోన్లల్ల బంగారం!?|ADUGU TRENDS

అవునుల్లా...నిజమే! గా పాత పోన్లు బంగారమే. గా పోన్లల్ల కెల్లి ఎల్లే, గా బంగారమసొంటి పొరతోటి, బంగారం లెక్క బ్రాస్ లెట్లు, కడాలు తయారు చేసుకుంటాండ్లు. కావాలంటే మీరే సూడుండ్లి. ఇగో గీ యన్న.....

సంక్లిష్టంగా పశ్చిమాసియా సంక్షోభం|EDITORIAL

పశ్చిమాసియాలో సమసినట్లే కనిపించిన యుద్ధం మళ్లీ ఎగసిపడుతోంది. కొంగ జపాలు, దొంగ తపాలు తప్ప యుద్ధం ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. యుద్ధ విరమణ, శాంతి ప్రవచనాలు, రాజీ మార్గాలు రానురాను మూసుకుపోతున్నాయి....

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News