నిజమే గద. పిల్లెట్లున్నా, కాకికి ముద్దే గదా? గట్ల కాకికే కాదుల్లా.. ఏ పచ్చికైనా గంతేనుల్లా.. కాకుండే గిదీన్ని సూడుండ్రి.
ఒకాయినె ట్రాక్టర్ తోటి శెలక దున్నుతాండు. దున్నుకుంట దున్నుకుంట వత్తాంటే, పురుగుల కోసం వచ్చిన పచ్చులన్నీ ఎగిరిపోతానయి. గనీ, ఓ దగ్గర ఓ పచ్చి మాత్రం ఎగరలే. ట్రాక్టర్ కు అదరలె. బెదరలే. అది పెట్టిన గుడ్లను తన రెక్కలతోటి పొదివి, నీడలెక్క రచ్చణగా పట్టి, కదలకుండ అట్లనే నిలబడ్డది. ఇగ గా పచ్చిని సూసిన ట్రాక్టర్ డైబరే, పక్కకు తిప్పుకుని పోయండు. తల్లి పేమకు సాటి ఇలల లేనేలేదుపో! ఏమంటరు?

