ఇగ ఇయ్యాల రేపు, ఇంటింటికీ సైకోల్ మోటరు, కార్లేనాయె. ట్రాక్టరో, జేసీబో, డోజరో, ఏదో ఓ మిషిని లేనోళ్ళు లేకనేపాయిరి. గవాటిని కడగాలంటే గవి కడిగే మిషిన్ల కాడికి పోవాలె. ఇగ గట్ల పోవాల్నంటే టైముండాలె. వందలకు వందలు రూపాలు పెట్టాలె.
ఇగ గివన్నీ లేకుండ గవాటిని ఇండ్లల్లనే కడుక్కునేటందుకు ఓ ఉపాయం కనిపెట్టిండ్లు. శిన్న పొక్క ఉండి, పైన మూత ఉండే ఒక ప్లాస్టిక్ డబ్బను తీస్కోవాలె. గదాన్ని కుతికెల కాడికి కత్తిరియ్యాలె. ఇగ గదాన్ని కడిగి, నీళ్ళ పైపుకు రెండు వాచర్లు యేసి, గదాన్ని గింత మంటతోటి అతికియ్యాలె. గదాంట్ల కెల్లి సన్నగా లాసిగ నీల్లొస్తయి. ఇగ గదాంతోటి కడుక్కోవాలె. మంచిగుంది కదా! గీ ఇకమతును మీరు గూడ సురువు శేయిండ్లి.

