
గాలి, ఎలుతురు లేకపోతే ఇల్లేం బాగుంటది? అంతా శీకటి శీకటేనాయె. గందుకే గిప్పుడు ఇండ్లల్ల ఇశాలంగ బాల్కనీలు పెట్టుకుంటాండ్లు. గీ మద్దెల గవాటిని ఇంకా కొత్తగ శేపిత్తాండ్లు.
బాల్కనీకి స్లైడింగ్ డోర్ల పేరుతో గిరికల మీద, మీటల మీద అటు ఇటు జరుపుకునే తీర్గ ప్లాస్టిక్ పై కప్పుతోని, ఎలుతురు కనబడే తీర్గ గవుంటయి. ఎప్పుడన్న ఆన పడ్డదనుకోండ్లి. ఇగ గవాటిని జరుపుకుంటే శినుకు పడదు. తడవదు. శిత్తడి కాదు. ఆన ఎలిసినంక, గవాట్ని యెనుకకు జరుపుకుంటే మల్లా గాలి ఎలుతురు కావాల్సినంత ఉంటదిన్నట్లు. ఎట్లున్నది? గీ ఇకమతు? ఇల్లు కట్టుకుంటే మీరు గూడ గిట్లనే శేయిండ్లి.

