మానవత్వమన్నా… మనుసులన్నా, గీ ఆలుమొగలే పో! గీ పపంచకంల మనిషన్నోడు మచ్చుకైనా కనబడతలేడు. ఎవరిని ఎవ్వరూ నమ్ముతలేరు. ఆకరికి తల్లిని పిల్ల, పిల్లని తల్లి… పెనిమిటిని పెండ్లం, పెండ్లాన్ని పెనిమిటి గూడ నమ్ముతలేరు. గనీ గీ ఇద్దరిని సూత్తె మంటగలుస్తున్న మానవత్వం మల్ల కనబడ్తది.
అవునుల్లా… గా దారెంట ఓ ముసలవ్వ, ముసలయ్యలు పోతాండ్లు. అవ్వ ముందట నడిస్తే, గా అయ్య ఎనుక నడుస్తాండు. ముందు నడుస్తున్న అవ్వ, కుడి శేత ఓ కట్టెను ఊతంగా పట్టుకుంటే, ఎడమ శేత మరొక కట్టెను ఎనుక నడుస్తున్న ఆయ్య శేతుల పెట్టింది. ఇగ ఎనుక అయ్య గూడ గా అవ్వ ఇచ్చిన కట్టెను పట్టుకుని నడుస్తాండు. అవ్వ దారి సూపిత్తాంటే, గా అయ్య గా దారిన నడుస్తండాన్నట్లు.
ఇగ గది సూసిన ఓకాయన మనసు కరిగి, గదాన్ని ఈడియ దీసిండు. గా ఈడియను సొసల్ మీడియల పెట్టిండు. మనుసులంటే గి వీల్లే పో! మంటగలిసిన మానవత్వం మల్ల శిగురిత్తనే ఉందని అనుకుంటాండ్లు. మనిసికి ఊతం మనిసే గదా!

