యెనకటి రోజులు మల్లొత్తానయి. కాల శెక్రం తిరిగి తిరిగి మల్లా మొదటి కొత్తాంది. అన్నీ గిట్లనే జరుగుతానయి. గిది గూడ గిట్లనే.
గా రోజుల్ల మన ఇండ్లల్ల మట్టి మీద, పెండతోటి అలికేది. ముగ్గు పెట్టేది. ఐటెంక ఎర్రమట్టితోని అలికితే మస్తుగుండేది. గిదీని తర్వాత సిమిటితోటి గచ్చు సేసుకొని, అలికిట్లు గండ్లింత రంగులేసి పైన రుద్దేటోల్లు. గది గూడ మస్తుగ కనిపించేది. ఇగ రానురాను షాబాద్ బండలు, టైల్స్, గ్రానైట్స్ పేర్లతోనే ఏవేవో వచ్చినయి. ఇగ గవేసుకుని మురిసుడు మొదలు పెట్టిండ్లు. గట్లాంటివి పైసలున్నోళ్లు మస్తుగ చేసుకుంటోల్లు. ఇగ గది గూడా పోయి ఏదో ‘ఎపోక్సీ ప్లోరింగ్’ అని ఓ పెయింటు వచ్చిందట. గదాన్ని ఇంట్ల యేసుకుంటే తెల్లగా మెరిసిపోయి సర్గంల ఉన్నట్టే వుంటదట. మళ్ళా గా పెయింటుకి బండలు, టైల్స్ కంటే రేటు తక్కువట. ఇప్పుడు గిదే ట్రెండింగన్నట్లు. గీదెదో మంచిగున్నది గదా మీరు కూడా ట్రై చేయండ్లి.

